ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బర్త్ డే స్పెషల్ గా 'చిరంజీవి దోసె'

Sat, Aug 22, 2015
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి 60వ జన్మదినోత్సవం సందర్భంగా, ఈ రోజు సాయంత్రం హైదరాబాదులోని 'పార్క్ హయత్' హోటల్లో ఘనంగా వేడుకకి ఏర్పాట్లు చేశారు. ఈ పుట్టినరోజు వేడుకకి తరలి వస్తోన్న ముఖ్యఅతిథుల కోసం వివిధ రకాల వంటకాలు తయారవుతున్నాయి. వాటిలో 'చిరంజీవి దోసె' గురించి ముఖ్యంగా వినిపిస్తోంది.

చిరంజీవికి ఇతర చిత్ర పరిశ్రమల్లోని పెద్దలతోను మంచి అనుబంధం వుంది. ఈ కారణంగా బాలీవుడ్ నుంచి అమితాభ్ దంపతులు .. శ్రీదేవి దంపతులు .. సల్మాన్ కుటుంబ సభ్యులు .. టబూ తదితరులు రానున్నారు. అలాగే కోలీవుడ్ నుంచి రజనీకాంత్ తదితరులు వస్తున్నారు. వీరందరి కోసం తయారుచేసే వంటక్లాల్లో 'చిరంజీవి దోసె' ప్రధానంగా కనిపించనుంది. చిరంజీవి ఇంటి 'హెడ్ కుక్' ఈ దోశను చాలా బాగా తయారు చేస్తాడట. చిరంజీవి ఎంతగానో ఇష్టపడే ఈ దోశను, ఈ పుట్టినరోజున అతిథులకు రుచి చూపించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు కూడా చేసినట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)