ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెజీనకి అగ్రస్థానం ఖాయమట!

Fri, Aug 21, 2015
రెజీన
రెజీన
రెజీన నటన సూపర్ .. ఆమె అగ్రస్థానాన్ని అందుకోవడానికి ఎంతో కాలం పట్టదని దర్శకుడు హరీశ్ శంకర్ చెబుతున్నాడు. ఆయన తాజా చిత్రం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లో ఆమే కథానాయిక. తెలుగు తెరపై నాజూకుగా అనిపిస్తూ .. చలాకీగా కనిపించే కథానాయిక రెజీన. ఒక్కో సక్సెస్ ని సాధిస్తూ ముందుకి వెళుతోన్న ఆమె, త్వరలో 'సుబ్రమణ్యం ఫర్ సేల్ 'తో పలకరించనుంది. ఈ సినిమాలో ఆమె 'సీత'గా అలరిస్తుందట.

ఈ పాత్రను ఆమె చాలా బాగా పోషించిందనీ, ఈ పాత్ర ఆమెకి మరింత పేరు తీసుకురావడం ఖాయమని ఆయన అంటున్నాడు. పాత్రను అర్థం చేసుకుని దానిని మరింత ప్రతిభావంతంగా ఆవిష్కరించడం రెజీనకి బాగా తెలుసనీ, అందువలన ఆమె అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు బాగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. నిన్నగాక మొన్న తాను మెచ్చిన కథానాయిక రెజీన అంటూ ఓ ప్రశ్నకి సమాధానంగా అల్లు శిరీష్ చెప్పాడు. ఇప్పుడు హరీష్ శంకర్ ఆమెని ఇలా ప్రశంసిస్తున్నాడు. అనతికాలంలోనే రెజీన ఇన్నేసి మార్కులు సంపాదించుకుంటూ వుండటం విశేషమే.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)