ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ 'కబాలి' నేపథ్యం ఇదేనట!

Fri, Aug 21, 2015
రజనీకాంత్
రజనీకాంత్
కోలీవుడ్ లో విజయ్ మూవీ 'పులి' తరువాత అందరూ మాట్లాడుకునే సినిమాగా 'కబాలి' కనిపిస్తోంది. ఈ సినిమాలో రజనీ డాన్ పాత్రని పోషిస్తున్నాడనే విషయం, ఈ సినిమా షూటింగ్ మలేసియా .. సింగపూర్లలో జరుగుతుందనే విషయం ముందుగానే బయటికి వచ్చాయి. ఈ సినిమాలో డాన్ అయిన రజనీ ..శత్రువుల పాలిట సింహ స్వప్నంలా కనిపిస్తూ, అక్కడి నిస్సహాయులకు అండగా నిలబడతాడు.

దాంతో తమ పాలిట దైవంగా వాళ్లు ఆ డాన్ ని ఆరాధిస్తూ ఉండటమే ఈ సినిమా లైన్ అంటూ కోలీవుడ్ లో వినిపిస్తోంది. రజనీ స్టైల్ తో మంచి సందేశం ఇచ్చేదిగా ఈ కథను తీర్చిదిద్దారట. నేపథ్యం 'బాషా'కి దగ్గరగా వున్నా .. దానికి, ఈ కథకు ఎలాంటి సంబంధం ఉండదని అంటున్నారు. తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోకుండా అవసరమైన మార్పులను స్వేచ్ఛగా చేసుకోమని రజనీ .. దర్శకుడితో చెప్పడాన్ని బట్టి, రంజిత్ పై ఆయన ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నది తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)