ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మేకప్ లేకుండా నటిస్తున్న రజనీ!

Thu, Aug 20, 2015
రజనీకాంత్
రజనీకాంత్
రజనీకాంత్ మేకప్ లేకుండా నటిస్తాడట! అనే టాక్ కోలీవుడ్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తాజాగా రూపొందుతోన్న 'కబాలి' సినిమాలో ఆయన మేకప్ లేకుండా కనిపిస్తాడని ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్ అవుతూ వుండటం విశేషం. సాధారణంగా రజనీకాంత్ తెరపై ఉన్న దానికి పూర్తి భిన్నంగా .. చాలా సింపుల్ గా బయట కనిపిస్తూ వుంటాడు. అలాగే ఆయన తెరపై కనిపించడానికి సిద్ధపడటం, అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అయితే ఈ సినిమాలో రజనీ పూర్తిగా అలా కనిపించడనీ, కథాపరంగా కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళేంత వరకూ మాత్రమే ఆయన మేకప్ లేకుండా కనిపిస్తాడని మరికొందరు అంటున్నారు. ఇక నిజానిజాలు అధికారింగా తెలియాల్సి వుంది. రంజిత్ దర్శకత్వంలో సింగపూర్ .. మలేసియాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాపై రజనీ బలమైన విశ్వాసంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)