ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ ఫంక్షన్ కి ఘనమైన ఏర్పాట్లు

Thu, Aug 20, 2015
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి పుట్టినరోజు వేడుకకి హైదరాబాదులోని 'పార్క్ హయత్' హోటల్ వేదికగా నిలవనుంది. ఆగస్టు 22 సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకి వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ .. కోలీవుడ్ .. బాలీవుడ్ కి సంబంధించిన పెద్దలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఇక బాలీవుడ్ నుంచి అమితాభ్ .. అమీర్ ఖాన్ రావడం ఖయమన్నట్టుగా తెలుస్తోంది.

ఇది చిరంజీవి 60వ పుట్టినరోజు కావడం .. ఆయన 150 సినిమాకి సంబంధించిన స్పష్టమైన సమాచారం ఈ వేదిక నుంచి లభించే అవకాశం వుండటం .. చరణ్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ .. టీజర్ విడుదల ఉండటంతో ఈ వేడుక మరింత విశేషాన్ని సంతరించుకుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చిరూ జన్మదిన వారోత్సవాలు జరుపుతూ వస్తోన్న ఆయన అభిమానులు, ఈ వేడుకలో పాల్గొనడానికి ఉత్సాహంగా వున్నారు. చిరూ ఫ్యామిలీ సన్నిహితులు .. చరణ్ దంపతులు దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)