ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనట!

Wed, Aug 19, 2015
రవితేజ
రవితేజ
రవితేజ నటించిన 'కిక్ 2' చిత్రం ఎల్లుండి విడుదలవుతుండగా, ఆయన మరో చిత్రమైన 'బెంగాల్ టైగర్' షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనే సందేహం సహజంగానే అభిమానులకు కలుగుతూ వుంటుంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్న వార్తను బట్టి చూస్తే, ఆయన నెక్స్ట్ సినిమా సుధీర్ వర్మతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

'స్వామి రారా'తో మొదటి సినిమాతోనే సుధీర్ వర్మ హిట్ కొట్టాడు. టేకింగ్ బాగుందనే టాక్ రావడంతో, 'దోచేయ్'ని తెరకెక్కించే ఛాన్స్ తగిలింది. అయితే మొదటి సినిమాకి ఇది దగ్గరగా ఉందని అనుకున్నారు. ఆయన చెప్పిన ఒక లైన్ రవితేజకి బాగా నచ్చిందట. కథకి పూర్తి రూపాన్ని ఇచ్చిన తరువాత వినిపించమని రవితేజ చెప్పడంతో, ఆయన ఆ పనిని పూర్తి చేశాడట. ఆ కథ బాగా వచ్చిందని రవితేజ అనుకుంటే, సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ కాలం పట్టదని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)