ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రుతిహాసన్ మెచ్చిన దర్శకుడు!

Tue, Aug 18, 2015
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
తాను ఇంతవరకూ పనిచేసిన దర్శకులలో కొరటాల శివ శైలి తనకి బాగా నచ్చిందని శ్రుతిహాసన్ చెబుతోంది. శివ మంచి దర్శకుడనీ, ఏ సన్నివేశానికి ఎంత నటన అవసరమో అంతవరకు మాత్రమే ఆ నటీనటుల నుంచి రాబట్టడం ఆయన ప్రత్యేకతంటూ చెప్పుకొచ్చింది. 'శ్రీమంతుడు' చిత్రంలో తన పాత్ర అంత బాగా రావడానికి ఆయనే కారకుడని అంటోంది. ఆయనతో కలిసి పనిచేయడం తనకి ఎంతో సౌకర్యవంతంగా అనిపించిందంటూ, తాను ఇంతవరకూ పనిచేస్తోన్న దర్శకులందరికన్నా శివకి ఎక్కువ మార్కులు ఇచ్చేసింది.

కమల్ కూతురుగా, తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో అగ్రకథానాయికగా శ్రుతికి మంచి క్రేజ్ వుంది. అలాంటి శ్రుతి ఈ రేంజ్ లో కొరటాలని ప్రశంసించడం విశేషమే. ఎప్పుడూ తన కథానాయికల గురించి మాట్లాడని మహేష్ .. శ్రుతిని నటనని మెచ్చుకోవడం, తన దర్శకుల గురించి పెద్దగా ప్రస్తావించని శ్రుతి .. కొరటాలని ప్రశంసించడం శ్రీమంతుడు విశేషాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)