ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలాంటి పొరపాటు చేయనంటోన్న తమన్నా

Mon, Aug 17, 2015
తమన్నా
తమన్నా
బాలీవుడ్ లో తాను చేసిన సినిమాలు ఎందుకు పరాజయం పాలయ్యాయనేది తమన్నా తెలుసుకుంది. ఇకపై అలాంటి పొరపాట్లు చేయనని చెబుతోంది. 'బాహుబలి' సినిమా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దాంతో ఇతర భాషలతో పాటు తిరిగి హిందీ నుంచి కూడా ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.

గతంలో ఆమె చేసిన హిందీ చిత్రాలు పరాజయం పాలవడంతో, కొత్త అవకాశాలేవీ తలుపు తట్టలేదు. దాంతో ఆమె టాలీవుడ్ కి తిరుగు టపాలా వచ్చేసింది. బాహుబలి సక్సెస్ తరువాత పరిస్థితి మారిపోవడంతో, ఈసారి తొందరపడనని తమన్నా చెబుతోంది. గతంలో తాను చేసిన హిందీ సినిమాలు ప్రస్తుతం వున్న ట్రెండును అందుకోకపోవడం వలన ఫ్లాప్ అయ్యాయనీ, అందువలన ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తానని అంటోంది. అనుభవాన్ని మించిన పాఠం లేదని అందుకే అన్నారు మరి!
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)