ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భరణి 'భక్త కన్నప్ప' ఎప్పుడు?

Sun, Aug 16, 2015
భరణి
భరణి
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణికి 'భక్త కన్నప్ప' డ్రీమ్ ప్రాజక్ట్. గత కొన్నాళ్లుగా ఈ స్క్రిప్టుపై ఆయన పనిచేస్తున్నారు. కామెడీ హీరో సునీల్ తో చేద్దామనుకున్నప్పటికీ, కుదరలేదు. అయితే, ఇటీవలే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ నటుడు మోహన్ బాబు ముందుకొచ్చారు. ఆయన తనయుడు విష్ణు ఇందులో కన్నప్పగా ప్రధాన పాత్ర పోషిస్తాడు.
24 ఫ్రేమ్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భరణి తాజాగా తెలిపారు. వచ్చే జనవరి నుంచి దీని షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. అలాగే, మరోపక్క తాను ఆర్టిస్టుగా కూడా బిజీగా వున్నానని, స్టార్ హీరోలు నటిస్తున్న పన్నెండు సినిమాలలో నటిస్తున్నానని భరణ తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)