ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సక్సెస్ కి మరో పేరు ఆయన!

Fri, Aug 14, 2015
రామానాయుడు
రామానాయుడు
రామానాయుడు పేరును ప్రస్తావించకుండా తెలుగు సినిమా వైభవాన్ని చెప్పుకోవడం అసాధ్యమే అవుతుంది. అంతగా ఆయన తెలుగు చిత్రపరిశ్రమను ప్రభావితం చేశారు. మొదటి నుంచి కూడా ఆయన ఆలోచనలు చాలా బలంగా .. స్థిరంగా ఉండేవి. సాహసాన్ని విజయం వరించి తీరుతుంది .. కృషి చేసినప్పుడు ఫలితం అందకుండా పోదు అనేది ఆయన విశ్వాసం. కథానాయకుడు కావాలనే సంకల్పంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, పరిస్థితుల కారణంగా నిర్మాతగా మారారు.

మొదటి చిత్రం 'అనురాగం' నిరాశపరచడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. మరోసారి ప్రయత్నించి చూద్దామనే పట్టుదలతో, ఎన్టీఆర్ తో 'రాముడు - భీముడు' నిర్మించారు. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్ళిన ఆయనకి మళ్లీ పరీక్షా సమయం ఎదురైంది. చివరిగా ఒక్క ఛాన్స్ తీసుకుని అక్కినేనితో 'ప్రేమనగర్' నిర్మించి చూద్దామని భావించి రంగంలోకి దిగారు. ఈసారి విజయం ఆయన్ని తప్పించుకుని వెళ్లలేకపోయింది.

అది మొదలు ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అలా ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకసారి ఎన్టీఆర్ సినిమాతో ముందడుగు వేయడం .. మరో మారు ఏఎన్నార్ తో ముందడుగు వేయడం విశేషం. ఈ రెండు సినిమాలు ఒక ట్రెండ్ ను క్రియేట్ చేయడం మరో విశేషం. అలా సాహసంతో ఆయన వేసిన ముందడుగే ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టింది .. సక్సెస్ కి మరో పేరుగా నిలబెట్టింది.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)