ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముగ్గురు భామలతో చైతూ!

Fri, Aug 14, 2015
రాశీఖన్నా
రాశీఖన్నా
ఒక వైపున యాక్షన్ హీరోగా .. మరో వైపున రొమాంటిక్ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడానికి నాగచైతన్య ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన త్వరలో 'ప్రేమమ్' రీమేక్ లో నటించబోతున్నాడు. ముగ్గురు కథానాయికలతో ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఆ ముగ్గురు నాయికలుగా సమంతా .. రకుల్ .. రాశీఖన్నా పేర్లు వినిపిస్తున్నాయి.

కథాపరంగా మలయాళ చిత్రమైన 'ప్రేమమ్'లో ముగ్గురు నాయికలు ఉంటారు. ఒక్కో దశలో ఒక్కొక్కరితో హీరో ప్రేమలో పడతాడు. కొత్తదనం కారణంగా మలయాళంలో అనూహ్యమైన విజయాన్ని అందుకోవడమే కాదు, ఇతర భాషా చిత్రపరిశ్రమలని కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. రాధాకృష్ణ నిర్మాణంలో .. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ రీమేక్ కి గాను, సమంతా .. రకుల్ .. రాశీఖన్నాలను సంప్రదించనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)