ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టైమ్ రావాలంటోన్న అక్షరహసన్

Fri, Aug 14, 2015
అక్షర హసన్
అక్షర హసన్
దేనికైనా టైమ్ రావాలని అంటూ వుంటారు. అలాగే తాను తెలుగులో సినిమా చేయడానికి కూడా సరైన టైమ్ రావాలని అంటోంది అక్షరహాసన్. ఒక వైపున తెలుగు .. తమిళ .. హిందీ చిత్రాల్లో నటిస్తూ శ్రుతిహాసన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఆమె చెల్లెలు అక్షర కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

హిందీలో 'షమితాబ్' సినిమాలో నటించి ఒకే అనిపించుకున్న అక్షర, ఆ తరువాత తమిళ .. తెలుగు భాషల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగకపోవడం గురించి ఆమెని అడిగితే తనదైన స్టైల్లో స్పందించింది. తెలుగులోనూ .. తమిళ్ లోను నటించాలనే ఆసక్తి తనకి కూడా ఉందనీ, అయితే అందుకు సరైన టైమ్ రావాలంటూ సమాధానమిచ్చింది. ముందుగా తాను బాలీవుడ్లో మరింత క్రేజ్ సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాననీ, సమయం వచ్చినప్పుడు తెలుగు .. తమిళ చిత్రాల్లోను నటిస్తానని స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)