ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జగపతిని గతంలోకి తీసుకెళ్లిన 'శ్రీమంతుడు'

Thu, Aug 13, 2015
జగపతిబాబు
జగపతిబాబు
జగపతిబాబు ఒక్కసారిగా గతంలోకి వెళ్లాడు .. తాను కథానాయకుడిగా చేసిన 'శుభలగ్నం' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన రోజులకి వెళ్లాడు. ఆ ఆనందానుభూతులను 'శ్రీమంతుడు' ప్రెస్ మీట్ లో పంచుకున్నాడు. మనీ మాత్రమే కాదు మనసున్నవాడిగా 'శ్రీమంతుడు' జనంలోకి వెళ్లడంతో, ప్రతి థియేటర్ ఇప్పుడు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ సినిమాలో మహేష్ బాబు కి తండ్రిగా నటించిన జగపతిబాబు కూడా ఈ ప్రెస్ మీట్ కి హాజరయ్యాడు. శ్రీమంతుడులో తనకి లభించిన పాత్ర పట్ల జగపతిబాబు సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తోన్న తీరు చూస్తుంటే, గతంలో భారీ వర్షాల్లోను 'శుభలగ్నం' పొందిన ఆదరణ గుర్తుకొస్తోందని చెప్పాడు. అంతకుమించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా థియేటర్ కి రప్పించగలిగినందుకు ఆనందంగా ఉందంటూ ఆ రోజులను తలచుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)