ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ అలిగాడట!

Thu, Aug 13, 2015
రవితేజ
రవితేజ
రవితేజ అలిగాడట .. ఎవరి పైనా అంటే, 'కిక్ 2' సినిమా పైన అని అంటున్నారు. ఆయన అలగడం వల్లనే ఈ సినిమా రిలీజ్ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. రవితేజ - రకుల్ జంటగా నటించిన 'కిక్ 2' ప్రేక్షకుల ముందుకి ఎప్పుడో రావలసి ఉంది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసి బడ్జెట్ పెంచేశాడట.

ఇక ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ, దర్శకుడిని గానీ .. హీరోను గాని ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత కల్యాణ్ రామ్ సంప్రదించలేదట. ఈ కారణంగానే దర్శకుడితో పాటు రవితేజ కూడా అలిగాడని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 21ని విడుదల తేదీగా నిర్ణయం చేసిన కల్యాణ్ రామ్, రేపు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఏర్పాటు చేశాడు. దాంతో సురేందర్ రెడ్డి .. రవితేజ అలక నిజమా? కాదా? అనేది రేపు తేలిపోతుందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)