ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనసూయకు సినిమాలు వద్దట!

Sun, Aug 09, 2015
అనసూయ
అనసూయ
ఈవేళ మన టీవీ యాంకర్లలో అనసూయ 'హాట్' ప్రాపర్టీ. ఇద్దరు పిల్లల తల్లయినా చక్కని శరీర సౌష్టవంతో 'బుల్లితెర అనుష్క'గా పేరు తెచ్చుకున్న ఈ సెక్సీ బ్యూటీకి వున్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. టీవీ షోలకే కాకుండా, సినిమా వేడుకలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ ముద్దుగుమ్మ పెద్ద మొత్తంలో చార్జ్ చేస్తుంది. ఆమె అందచందాలను ఎప్పుడో పసిగట్టిన దర్శక నిర్మాతలు చాలా సినిమాల్లో ఆఫర్లిచ్చారు. అయితే, ఆమె ఒప్పుకోలేదు.
ఈ క్రమంలో తాజాగా 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో మాత్రం నాగార్జునకు మేనకోడలిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమెను తమ సినిమాల్లో కూడా నటింపజేద్దామని భావించిన నిర్మాతలకు ఆమె 'నో' చెబుతోందట. తనకు పెద్దతెరకంటే, బుల్లితెరే ముద్దని చెబుతోందని అంటున్నారు. బోలెడు అవకాశాలు వస్తుంటే తిరస్కరిస్తున్న అనసూయ అంతరంగం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)