ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ చాన్స్ కోసం జగపతి వెయిటింగ్!

Sat, Aug 08, 2015
జగపతిబాబు
జగపతిబాబు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో నటించాలని చాలామంది నటీనటులు కోరుకుంటూ వుంటారు. అందుకు ఆయన పట్ల గల అభిమానం ఒక కారణమైతే, ఆయన సినిమాలో నటిస్తే వచ్చే క్రేజ్ మరో కారణం. అలా ఆయన సినిమాల్లో నటించాలనుకునే వారిలో తాజాగా జగపతిబాబు కూడా చేరిపోయాడు. తెలుగు తెరపై కథానాయకుడిగా .. విలన్ గా .. కీలకమైన పాత్రధారిగా జగపతిబాబు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

తమిళ్లోను ఆయన వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. తాజాగా శింబూ కథానాయకుడిగా చేస్తోన్న 'కాన్' చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. తన తమిళ సినిమాలను గురించి ఆయన మాట్లాడుతూ, అజిత్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అజిత్ సినిమాలో విలన్ గా నటించాలని ఉందనీ, లేదంటే కీలకమైన పాత్ర ఏదైనా ఫరవాలేదని అన్నాడు. అలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఒక వైపున తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా వున్న జగపతి బాబు, అజిత్ సినిమాలో చేయాలనుందని అనడానికి కారణం ఆయనకి అజిత్ పట్ల గల అభిమానమేనని చెప్పుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)