ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్?

Sat, Aug 08, 2015
రాజమౌళి
రాజమౌళి
'బాహుబలి' సినిమా విజయం తర్వాత దర్శకుడు రాజమౌళి స్థాయి అనూహ్యంగా పెరిగిపోయింది. తెలుగు హీరోలే కాకుండా పలువురు తమిళ, హిందీ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అజిత్, అల్లు అర్జున్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ రానుందని టాలీవుడ్ లో ప్రచారం మొదలైంది. సోషల్ మెసేజ్ వున్న ఓ రియలిస్టిక్ కథను సిద్ధం చేయాల్సిందిగా రాజమౌళి తనను అడిగినట్టు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల తెలిపారు. దీంతో ఇందులో అజిత్, అల్లు అర్జున్ నటించే అవకాశాలు ఉన్నట్టుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.
దీనిని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారని, అందుకే అజిత్, బన్నీలను ఈ ప్రాజక్టుకి ఎంచుకుంటున్నారని అంటున్నారు. అయితే, ఈ చిత్రం సెట్స్ కి వెళ్లడానికి చాలా సమయం వుంది. ఎందుకంటే, రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి 2', మహేష్ తో సినిమా చేయాల్సివుంది. ఆ తర్వాతే ఇది పట్టాలెక్కచ్చు. ఏమైనా, ఈ ప్రాజక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది సస్పెన్సుగానే వుంటుంది!
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)