ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరచిపోలేనంటోన్న మోహన్ బాబు

Fri, Aug 07, 2015
మోహన్ బాబు
మోహన్ బాబు
మోహన్ బాబు అనగానే విభిన్నమైన డైలాగ్ డెలివరీతో ఆయన పండించిన విలక్షణమైన పాత్రలు కనులముందు కదలాడతాయి. కామెడీ టచ్ తో కూడిన పాత్రలు .. ప్రతినాయకుడి పాత్రలు .. ఆ తరువాత హీరో పాత్రలు ఇలా అంచెలంచెలుగా ఎదిగిన నటుడాయన. అలా ఆయన ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, కృషి .. పట్టుదలతో వాటిని అధిగమించిన తీరు కనిపిస్తాయి. అందుకే భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబు గా కీర్తిప్రతిష్ఠలు అందుకున్నాడు.

మద్రాస్ లో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటోన్న ఆయన, అది కాస్తా పోవడంతో సహజంగానే సినిమాలపైకి మనసు లాగింది. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఆయనకి బలంగా ఉండేది. అలాగే దాసరి నారాయణరావుని కలుసుకుంటే ఏదో ఒక వేషం ఇవ్వకపోతారా అనే ఆశతో ఉదయాన్నే ఆయన ఇంటిదగ్గరికి వెళ్లి నిలబడేవాడట. అలా మొత్తానికి ఆయన దృష్టిలో పడి 'స్వర్గం - నరకం' సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

ఆ సినిమాతో ఆయన పేరే కాదు .. జీవితం కూడా మారిపోయింది. దాసరి నారాయణరావుని గురువుగా అభిమానిస్తూనే ఆయనకి అత్యంత ఆప్తుడైపోయాడు. అలాగే ఎన్టీఆర్ ని చూస్తేనే చాలనుకున్న మోహన్ బాబు ఆయనకి అత్యంత సన్నిహితుడై, 'మేజర్ చంద్రకాంత్' చిత్రాన్ని నిర్మించే స్థాయికి చేరుకున్నాడు. తాను ఎక్కివచ్చిన మెట్లను తాను ఎప్పుడూ మరిచిపోలేదని ఆయన అంటూ వుంటాడు. పెద్దలపట్ల గౌరవం .. వృత్తిపట్ల అంకితభావం .. క్రమశిక్షణ ఇవే తన విజయ రహస్యాలని చెబుతూ ఉంటాడు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)