ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పెళ్లికి సిద్ధమవుతున్న సుందరి!

Fri, Aug 07, 2015
అసిన్
అసిన్
వయసు ముదిరినా అవకాశాలు ఉన్నంత కాలం హీరోయిన్లు పెళ్లి మాట ఎత్తరు. సంపాదనే లక్ష్యంగా సినిమాలు చేస్తూనే వుంటారు. ఎప్పుడైతే ఆఫర్లు తగ్గిపోయి, ఖాళీ అయిపోతారో అప్పుడిక తమకు తగ్గా వరుడిని చూసుకుని జీవితంలో సెటిల్ అయిపోతారు. మల్లూ బ్యూటీ అసిన్ కూడా ప్రస్తుతం అదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకున్న చందంగా బాలీవుడ్ అవకాశాలను చూసుకుని దక్షిణాది సినిమాలను వదులుకుని, అక్కడికి వెళ్లి చివరికి నెగ్గుకురాలేకపోయింది. ఆరేడు సినిమాలతోనే అక్కడ తన కెరీర్ని సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిక యాక్టింగ్ కెరీర్ పై ఆశలు వదులుకున్న ఈ సుందరి ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోందట. అయితే, ఆ వ్యాపారవేత్త ఎవరన్నది మాత్రం ఇంకా వెల్లడికాలేదు!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)