ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భరణిపై హరికథ, నాటకాల ప్రభావం

Mon, Aug 03, 2015
తనికెళ్ల భరణి
తనికెళ్ల భరణి
తనికెళ్ల భరణిలో ఒక నటుడు .. రచయిత .. దర్శకుడు నిర్మాత కనిపిస్తారు. తెలుగు సాహిత్యంపై ఆయనకి మంచి పట్టుంది. తెలుగు సినిమా రచయితగా, నటుడిగా ఆయన చూపిన వైవిధ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక భరణి దర్శకుడు గా వ్యవహరించిన చిత్రాలు, ఆయన అభిరుచికి అద్దం పడుతుంటాయి. తాను ఈ రోజున ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే స్థాయిలో ఉండటానికి కారణం, చిన్నప్పటి నుంచి నాటకాలు .. హరికథలపై తనకి గల ఆసక్తేనని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు.

ఎక్కడ నాటకాలు జరుగుతున్నా .. హరికథలు చెబుతున్నా అక్కడ ఆయన వాలిపోయేవాడు. ఆయా నాటకాల్లోని పాత్రలు పలికిస్తోన్న హావభావాలు ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఇక హరికథ చెప్పే వ్యక్తి మాటలతోనే పాత్రలను నడిపిస్తూ .. దృశ్యాన్ని ఆవిష్కరించే తీరు ఆయనని ఎంతగానో ఆకట్టుకుందట. అలా తాను కూడా నటించాలి .. నాటకాలు రాయాలి అనే ఆసక్తి ఆయనలో పెరుగుతూ వచ్చింది. ఇక నటుడిగాను .. నాటక రచయితగాను మంచి మార్కులు సంపాదించుకున్న ఆయన సహజంగానే సినిమాల వైపు వచ్చాడు. అలా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆయన, ఒక్కో మెట్టును ఎక్కుతూ .. ఎదుగుతూ ఆ లక్ష్యానికి చేరుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)