ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రియ పూర్తిగా డీలాపడిపోయిందట!

Mon, Aug 03, 2015
శ్రియ
శ్రియ
ఏదైనా ఒక ఫలితాన్ని గురించి ఆశగా ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడు, అది ఆశించిన ప్రయోజనం అందించకపోతే నిరాశపడిపోవడం జరుగుతూ ఉంటుంది. అందాల కథానాయిక శ్రియను ప్రస్తుతం అలాంటి నిరాశా నిస్పృహలు ఆవరించాయట. తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాల్లో శ్రియ కెరియర్ అస్సలు ఆశాజనకంగా లేదు. అందువల్లనే ఆమె హిందీ రీమేక్ 'దృశ్యం' చిత్రంలో టీనేజ్ అమ్మాయికి తల్లిగా నటించింది.

ఇక మలయాళ .. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, సహజంగానే హిందీ రీమేక్ పై ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయిందనే టాక్ అక్కడ వినిపిస్తోంది. అందుకు కారణమేమిటనే విషయం అటుంచితే, ఈ సినిమా సక్సెస్ అయితే హిందీలో కొన్నాళ్లు నెట్టుకురావచ్చనుకున్న శ్రియ మాత్రం పూర్తిగా డీలాపడిపోయిందట.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)