ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగచైతన్య ఆ రీమేక్ పై దృష్టిపెట్టాడట!

Sat, Aug 01, 2015
నాగచైతన్య
నాగచైతన్య
తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది .. నాగచైతన్య ఓ సినిమా రీమేక్ పై దృష్టి పెట్టాడని. ఆ సినిమా మరేదో కాదు మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమకథా చిత్రం 'ప్రేమమ్'. ఈ సినిమా చూసిన నాగచైతన్య .. ఈ కథపై మనసు పారేసుకున్నాడట. ఈ సినిమాను తెలుగులో తాను చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో స్రవంతి రవికిషోర్ ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నట్టుగా .. రామ్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అసలా సినిమా గురించే తనకి తెలియదని రామ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో 'ప్రేమమ్' రీమేక్ రైట్స్ విషయం చూడవలసిందిగా నాగచైతన్య ఒక నిర్మాతకి చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రేమకథా చిత్రాలతోనే ఎక్కువ మార్కులు కొట్టేసిన నాగచైతన్య, మరో సక్సెస్ కోసమే 'ప్రేమమ్' రీమేక్ పై దృష్టి పెట్టాడని అంటున్నారు. అదే నిజమైతే ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)