ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అటాక్' అంటోన్న మంచు మనోజ్

Fri, Jul 31, 2015
మనోజ్
మనోజ్
'అటాక్' చిత్రం తన కెరియర్లో ప్రత్యేకతను సంతరించుకున్నదిగా మంచు మనోజ్ భావిస్తున్నాడు. ఎందుకంటే తన పెళ్లి జరిగిన తరువాత విడుదలవుతోన్న మొదటి సినిమా ఇది. అందుకే ఇది తప్పనిసరిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా 'సురభి' కనువిందు చేయనుంది.

గతంలో మోహన్ బాబుతో 'రౌడీ' .. విష్ణుతో 'అనుక్షణం' చిత్రాలను తెరకెక్కించిన వర్మ, మనోజ్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. వర్మ తరహా యాక్షన్ సీన్లు .. నాయకా నాయికల మధ్య రొమాంటిక్ దృశ్యాలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. ఆగస్టులో విష్ణు 'డైనమైట్' విడుదలవుతుండగా .. సెప్టెంబర్లో 'అటాక్' ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి అన్నదమ్ములలో ఎవరెన్ని మార్కులు సంపాదించుకుంటారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)