ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకాంత్ అభిమానం అలాంటిది!

Wed, Jul 29, 2015
రజనీకాంత్
రజనీకాంత్
ఎంతగానో ఎదుగుతూ అంతగాను ఒదిగిపోయే గొప్ప వ్యక్తులలో రజనీకాంత్ కూడా కనిపిస్తాడు. తాను సూపర్ స్టార్ ననే విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, చాలా సాధారణమైన వ్యక్తిలా ఆయన వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంటాడు. తనని అభిమానించేవారి కోసం .. తాను అభిమానించేవారి కోసం ఆయన ఓ సాధారణమైన వ్యక్తిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. తాజాగా జరిగిన ఒక సంఘటన ఇదే విషయాన్ని మరోమారు నిరూపించింది.

ఎమ్మెస్ విశ్వనాథన్ కి నివాళిగా ఇళయరాజా ఓ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఎమ్మెస్ స్వరపరచిన పాటలలోని అనుభూతి పరిమళాలను శ్రోతలంతా కలిసి మరోమారు ఆస్వాదించేలా ఆయన పాటల కార్యక్రమాన్ని నిర్వహించాడు. నిజానికి ఈ కార్యక్రమానికి ప్రముఖులెవరినీ అతిథులుగా ఆహ్వానించలేదు. అయినా తన అభిమాన సంగీత దర్శకుల కోసం, జోరుగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రజనీకాంత్ ఆ వేదిక దగ్గరికి చేరుకున్నాడు.

ఎమ్మెస్ విశ్వనాథన్ దేవుడనీ .. ఆయన సంగీతంలోని గొప్పతనాన్ని తనలాంటివారికి అర్థమయ్యేలా చెప్పే జ్ఞాని ఇళయరాజా అంటూ మాట్లాడాడు. తనని తాను తగ్గించుకుంటూ .. విశ్వనాథన్ - ఇళయరాజాలలోని గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పడం అక్కడివారికి ఆనందాన్ని కలిగించింది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)