ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజోల్ కథానాయికగా అజయ్ సినిమా!

Tue, Jul 28, 2015
అజయ్ దేవగణ్
అజయ్ దేవగణ్
త్వరలో కాజోల్ కథానాయికగా తాను ఒక సినిమాను నిర్మించనున్నట్టు అజయ్ దేవగణ్ ఒక సందర్భంలో చెప్పడం బాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. బాలీవుడ్ కి సంబంధించి ప్రేమించి పెళ్లిచేసుకుని అన్యోన్యంగావున్న జంటల్లో, అజయ్ దేవగణ్ .. కాజోల్ ముందువరుసలో కనిపిస్తారు. తాజాగా అజయ్ దేవగణ్ 'దృశ్యం' రిమేక్ లో నటించాడు. ఈ నెల 31న ఈ సినిమా విడుదల ఉండటంతో, ప్రచార కార్యక్రమాలతో ఆయన తీరిక లేకుండా వున్నాడు.

అలాగే 'దిల్ వాలే' సినిమాతో కాజోల్ కూడా బిజీగా వుంది. మళ్లీ ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలనుకుంటోన్న ప్రేక్షకుల ముచ్చట ఎప్పుడు తీరుతుందనే ప్రశ్నకి అజయ్ దేవగణ్ స్పందించాడు. తగిన కథ సిద్ధమైతే కలిసి నటించే అవకాశం ఉందనీ, అయితే కాజోల్ కథానాయికగా ఓ సినిమాను తాను నిర్మించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నానని అన్నాడు. ఈ నేపథ్యంలో భార్య కోసం అజయ్ ఎంచుకునే కథ ఎలా ఉంటుందోననేది ఆసక్తిగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)