ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో వేడుకకి అతిథిగా శ్రీదేవి

Tue, Jul 28, 2015
శ్రీదేవి
శ్రీదేవి
ఒకప్పుడు టాలీవుడ్లోను .. కోలీవుడ్లోను అగ్రకథానాయికగా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి, ఆ తరువాత బాలీవుడ్ కే పరిమితమైంది. అయినా ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన పాత్రలకిగాను దర్శక నిర్మాతలు ఆమెని సంప్రదిస్తూనే వున్నారు. అలా ఆమె తమిళ్లో నటించిన తాజా చిత్రమే 'పులి'. ఈ సినిమా ఆడియో వేడుకకే ఆమె ముఖ్యఅతిథిగా రాబోతోంది.

విజయ్ కథానాయకుడిగా, శ్రుతిహాసన్, హన్సిక నాయికలుగా నటించిన ఈ సినిమాలో, శ్రీదేవి మహారాణి పాత్రని పోషించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ఆడియో వేడుకను ఆగస్టు 2న నిర్వహించనున్నారు. తమిళనాడు - మహాబలిపురంలో అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఆడియో వేడుకకి శ్రీదేవి ముఖ్యఅతిథిగా రానుంది.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)