ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐటెం పాటలో ఇల్లీ బ్యూటీ

Tue, Jul 28, 2015
ఇలియానా
ఇలియానా
ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని అనుభవించిన గోవా బ్యూటీ ఇలియానా, బాలీవుడ్ ని కూడా ఏలేద్దామని ఆమధ్య అక్కడికి చెక్కేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే, అక్కడ తాను ఊహించిన విధంగా అమ్మడికి ఆదరణ దక్కలేదు. దాంతో టాలీవుడ్ కి వద్దామంటే అప్పటికే ఇక్కడి దర్శక నిర్మాతలు, హీరోలు ఆమెను మరచిపోయారు.

ఈ నేపథ్యంలో ఈ సన్నజాజి సుందరి తిరిగి ఓ ఐటెం పాటతో టాలీవుడ్ పునఃప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో ఆమెతో నటించిన యంగ్ హీరో నితిన్ ఆమెకు ఈ ఛాన్స్ ఇస్తున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్న సినిమాలో ఓ మాస్ మసాలా ఐటెం సాంగు వుంది. అందులో ఇల్లీ బ్యూటీ చేత డ్యాన్స్ చేయిద్దామని నితిన్ ఆమెను సంప్రదించాడట. వెంటనే ఆమె అందుకు ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఈ వంకతోనైనా మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్లు అందుకోవచ్చని అమ్మడు భావిస్తోంది!
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)