ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదృష్టవంతురాలినంటోన్న సునీత

Mon, Jul 27, 2015
సునీత
సునీత
తాము ఏ రంగాన్నయితే ఎంచుకుంటారో .. అదే రంగానికి చెందిన ప్రముఖులను కలుసుకోవాలనే కోరిక ఒకటి మనసులో ఉంటుంది. ఎప్పటికైనా అది నెరవేరుతుందో .. లేదోననే సందేహం ఉంటుంది. అది అత్యాశ అవుతుందేమోనని సరిపెట్టుకున్న సమయంలో, ఆ కోరిక నెరవేరితే ఇంతకన్నా అదృష్టం ఏవుంటుందనిపిస్తుంది. అలాంటి అదృష్టం తన సొంతమైందని ఒకానొక సందర్భంలో గాయని సునీత చెప్పింది. చిన్నప్పటి నుంచి కూడా సునీతకి పాటలు పాడటమంటే ఇష్టమట. ఆ ఆసక్తే ఆమె సంగీతాన్ని నేర్చుకునేలా చేసింది.

ఒక్కొక్కరి స్వరంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కనుక, ఆమె అందరి గాయనీ గాయకులని ఎంతగానో అభిమానించేది. ముఖ్యంగా బాలు .. సుశీల .. యేసుదాసుని ఎంతగానో ఆరాధించేది. వాళ్లతో కలిసి పాడటం సంగతి అలా ఉంచితే, వాళ్లున్న వేదికపై తనకి స్థానం దొరికితే చాలని అనుకునేదట. అలాంటి ఆమె ఒకసారి యేసుదాసుతో పాటుగా అదే వేదికపై 'నంది' బహుమతిని అందుకుందట. అలాగే బాలసుబ్రహ్మణ్యం .. సుశీలగార్లతో ఆత్మీయంగా మాట్లాడే అవకాశం కూడా కలిగిందట. అలా తాను కన్న కలలు నిజమయ్యాయి కనుక తాను ఎంతో అదృష్టవంతురాలినని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)