ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పొగడ్తలు పడవంటోన్న ఇళయరాజా

Fri, Jul 24, 2015
ఇళయరాజా
ఇళయరాజా
పొగడ్తలు ఎంత తియ్యగా ఉంటాయో .. విమర్శలు అంత చేదుగా అనిపిస్తాయనేది అందరికీ తెలిసిన నిజం. అయితే విమర్శలకన్నా తనకి పొగడ్తలు మరింత చేదుగా అనిపిస్తూ ఉంటాయని సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక సందర్భంలో చెప్పాడు. వివిధ భాషల్లోని పాటలకు ఇళయ రాజా అందించిన సంగీతం వీనులవిందు చేస్తూ ప్రయాణం చేస్తూనే వుంటుంది. ముఖ్యంగా ప్రేమ పాటలకి ఆయన పెట్టింది పేరు. ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలకపోవచ్చునేమోగానీ, దానిలోని అనుభూతి పరిమళాన్ని ఆవిష్కరించడానికి ఇళయరాజా పాట చాలు.

అలాంటి ఇళయరాజా తనకి ఎంతమాత్రం ఇష్టం లేనివి పొగడ్తలని చెప్పాడు. ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనని పిలవడం, తాను వెళ్లిన తరువాత అదేపనిగా తనని పొగడటం తనకి కాస్త ఇబ్బందిని కలిగించిందని అన్నాడు. అందుకే సాధ్యమైనంత వరకూ పొగిడేవాళ్లకి దూరంగానే ఉంటానని చెప్పాడు. తానెంతో ఇష్టపడే సంగీతం తప్ప వేరెవరి ప్రశంసలు తనకి ఆనందాన్ని కలిగించలేవని అన్నాడు. పొగడ్తలకి పొంగిపోయేవాళ్లు ఎక్కువగా కనిపించే ఈ రోజుల్లో, ఇళయరాజా వంటి సంగీత దర్శకుడు ఇలా అనడం ఆయన గొప్పతనం కాక మరేంటి?
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)