ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీకి విలన్ గా యంగ్ హీరో!

Thu, Jul 23, 2015
ఆది పినిశెట్టి
ఆది పినిశెట్టి
అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఈ నెల 26 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ముందుగా బన్నీపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. అందువలన నెగెటివ్ రోల్ పోషించే యువనటుడు కోసం అన్వేషించి, చివరికి 'ఆది పినిశెట్టి'ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి .. నెగెటివ్ రోల్ కి ఓకే చెప్పడం విశేషమేనని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టమైన అధికారిక ప్రకటన రావలసి వుంది.

ఒకప్పుడు తనకంటే వయసులో పెద్దవాడు .. హంగూ ఆర్భాటం వున్నవాడైన విలన్ తో కథానాయకుడు తలపడేవాడు. అయితే ఇటీవల ఈ విషయంలో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తోంది. విలన్ కూడా తమ వయసుకి తగినవాడుగా వుంటే బాగుంటుందనే భావనకి యువకథానాయకులు వచ్చేశారు. తాజాగా రూపొందుతోన్న సినిమాల్లో .. విలన్లు హీరో వయసుకి దగ్గరవారు కావడమే అందుకు నిదర్శనం.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)