ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కీర్తిసురేష్ దశతిరిగినట్టేనట!

Thu, Jul 23, 2015
కీర్తిసురేష్
కీర్తిసురేష్
కథానాయికగా నిలదొక్కుకునే ప్రయత్నంలోనే వున్న కీర్తిసురేష్ కి, ఇకపై దశ తిరిగినట్టేననే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం తన తాజా చిత్రంలో కథానాయిక ఈ అమ్మాయి అయితే బాగుంటుందని మణిరత్నం భావించడమే. కథానాయికలను అందంగా .. ఆరాధనా భావం కలిగేలా చూపించడంలో మణిరత్నం సిద్ధహస్తుడు. ఆయన సినిమాలో ఒక ఫ్రేమ్ లో కనిపించినా చాలని అనుకునేవాళ్లు లేకపోలేదు.

అలాంటి మణిరత్నం .. కార్తీ - దుల్కర్ సల్మాన్ లతో రూపొందించే సినిమాలో కీర్తిసురేష్ ను కథానాయికగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట. అదే జరిగితే అమ్మాయి దశతిరిగినట్టేనని అంటున్నారు. ఇక మాతృభాష అయిన మలయాళలోను .. తెలుగులోను కీర్తికి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. త్వరలోనే ఈ మూడు భాషలలోను ఆమె బిజీయైపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)