ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బిజీ అవుతోన్న అమలాపాల్

Tue, Jul 21, 2015
అమలాపాల్
అమలాపాల్
అమలాపాల్ ఇప్పుడు పూర్తిగా బిజీ అయిపోయింది. ఒక వైపున నటనపై దృష్టి పెడుతూనే మరో వైపున యాడ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే .. ఇంకో వైపున చిత్రనిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ మూడు విషయాల్లో ఆమె తీరికలేకుండా వుంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా అమలాపాల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, సినిమాలపై కాస్త శ్రద్ధ తగ్గించింది.

క్రేజ్ .. ఇమేజ్ వుండి ఖాళీగా ఉండటం ఎందుకనుకుందో ఏమో గానీ, తన స్థాయికి తగిన పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను ఇచ్చింది. ప్రకాష్ రాజ్ తో ప్రియదర్శన్ తెరకెక్కించనున్న సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక యాడ్స్ ను కూడా వదిలేది లేదు అనుకుందేమో, తాజాగా హీరో విజయ్ తో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. తెలుగు .. తమిళ .. మలయాళ ప్రేక్షకులకి అమలాపాల్ బాగా తెలుసు కాబట్టి, యాడ్స్ లో బిజీ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)