ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎమ్మెస్వీకి ఇళయరాజా స్వరార్చన!

Mon, Jul 20, 2015
ఇళయరాజా
ఇళయరాజా
ఇళయరాజా అంటే ఎందరికో పిచ్చి... అలాంటి ఇళయరాజాకు ఎమ్మెస్ విశ్వనాథన్ (ఎమ్మెస్వీ) అంటే మహా పిచ్చి. అసలు ఇళయరాజా సంగీత దర్శకుడిగా మారడానికి ప్రేరణ ఆయనే. ఆయన పాటలు వినే రాజా సినిమా సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. తాను సినిమా సంగీతంలోకి ప్రవేశించాలన్న కోరికతో చెన్నయ్ వచ్చిన కొత్తలో ఎమ్మెస్వీని చూడడం కోసం పరితపించిపోయేవాడు. వాళ్లింటి అడ్రస్ కనుక్కుని పొద్దున్నే అక్కడికి వెళ్లి... ఎమ్మెస్వీ కారెక్కి రికార్డింగ్ ధియేటర్ కి వెళ్లడాన్ని దూరంగా నిలబడి చూస్తూ మురిసిపోయేవాడు.



అలాంటి తన అభిమాన సంగీత విద్వాంసుడు ఇటీవల మరణించడంతో ఇళయరాజా కన్నీరు కార్చాడు. ఇప్పుడు ఆ సంగీత కళాకారుడికి ఈ ఏకలవ్య శిష్యుడు స్వరార్చన చేసి ఘన నివాళి అర్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 27న చెన్నయ్ లో జరిగే ఈ సంగీత విభావరిలో ఎమ్మెస్వీ స్వరపరచిన పాటల నుంచి తాను ఎంతగానో ఇష్టపడే ముప్పై ఆణిముత్యాలను ఇళయరాజా ఆధ్వర్యంలో వివిధ గాయకులు ఆలపిస్తారు. ఎమ్మెస్వీ వద్ద పనిచేసిన సంగీత వాద్యకారులు, ఆయన వద్ద పాడిన గాయకులు ఈ విభావరిని రక్తికట్టిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)