ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డాక్టర్ కావాలనుకున్న సౌందర్య!

Sat, Jul 18, 2015
సౌందర్య
సౌందర్య
ఒకప్పుడు నటీనటుల ఇంటర్వ్యూలో కామన్ గా ఒక సమాధానం వినిపిస్తూ వుండేది. నటన వైపు రాకపోతే ఏ రంగాన్ని ఎంచుకునేవారని అడిగితే, డాక్టర్ కావాలని అనుకున్నామని చెబుతూ వుండేవారు. కానీ తాను నిజంగానే డాక్టర్ కావాలనుకున్నాననీ, అయితే ఆ కోరిక నెరవేరలేదని ఒకానొక సందర్భంలో కథానాయిక 'సౌందర్య' చెప్పింది.

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన సౌందర్య, కథానాయికగా అంచలంచెలుగా ఎదగడానికీ .. అగ్రస్థానాన్ని అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలాంటి సౌందర్యకి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేదట. తన తండ్రి తెల్లచొక్కా వేసుకుని .. స్టెతస్కోప్ లా ఏదో ఒకటి మెడలో వేసుకుని .. కళ్లజోడు పెట్టుకుని డాక్టర్ లా అటూఇటు తిరిగేదట. పేషంట్లతో మాట్లాడుతున్నట్టుగా .. మందులు ఇస్తున్నట్టుగా నటించేదట.

అయితే తాను అనుకున్నట్టుగా డాక్టర్ కాలేకపోయాననీ .. అలా నటించినందుకు నటిగానే మారిపోయానంటూ చెప్పుకొచ్చింది. ఏదేవైనా తనకి పెద్దగా టైమ్ లేదన్నట్టుగానే ఆమె చకచకా సినిమాలు చేసేసి .. నెంబర్ వన్ కథానాయిక అనిపించుకుని అదృశ్యమైపోయింది. సౌందర్య తరువాత ఇంతవరకూ అలాంటి అందం కానీ .. అభినయం కాని ప్రేక్షకుల ముందుకి రాలేదనే అభిమానులు ఎంతోమంది వున్నారు. అలా జరగాలంటే మళ్లీ సౌందర్యే పుట్టాలేమో!
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)