ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నం మూవీలో దుల్కర్

Thu, Jul 16, 2015
దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్
మణిరత్నం సినిమాలో దుల్కర్ సల్మాన్ మళ్లీ ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. తనకి ఇంతటి పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెట్టిన మణిరత్నం దర్శకత్వంలో మరోమారు నటించడానికి ఉత్సాహాన్ని చూపించి, ఆయన తాజా చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేశాడనే వార్త కోలీవుడ్లో షికారు చేస్తోంది.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాని నాగార్జున .. మహేష్ కాంబినేషన్లో రూపొందించాలని మణిరత్నం అనుకున్నాడు. కొన్ని కారణాల వలన కుదరకపోవడంతో, కార్తీ .. దుల్కర్ సల్మాన్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)