ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పెళ్లికూతురు కానున్న కథానాయిక

Tue, Jul 14, 2015
శరణ్యా మోహన్
శరణ్యా మోహన్
అందమైన కథానాయికల పెళ్లి కబురు అభిమానులలో ఆసక్తిని కలిగిస్తూ వుండటం సహజం. తమ అభిమాన నాయికకి ఎవరితో పెళ్లి జరగనుంది? అతను ఏం చేస్తుంటాడు? అనే విషయాలను తెలుసుకోవాలనే కుతూహలాన్ని చూపుతుంటారు. తాజాగా అలాంటి ఆసక్తిని రేకెత్తిస్తూ తన పెళ్లి కబురు చెబుతోంది 'శరణ్యామోహన్'. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా ప్రేక్షకులకి శరణ్యామోహన్ తెలుసు.

తెరపై పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించే ఈ అమ్మాయి, నిజ జీవితంలోను అదే సంప్రదాయానికి విలువను ఇచ్చింది. పెద్దలు చూసిన సంబంధానికి తన అంగీకారాన్ని తెలుపుతూ, అరవింద్ కృష్ణన్ ని వివాహమాడనుంది. బంధుమిత్రుల సమక్షంలో మొన్న వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. వివాహ వేడుక ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తారట.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)