ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ టాలీవుడ్ పై పూజాహెగ్డే దృష్టి!

Thu, Jul 09, 2015
పూజాహెగ్డే
పూజాహెగ్డే
ఒక అడుగు కోలీవుడ్లో .. మరో అడుగు టాలీవుడ్లో వేసి .. ముచ్చటగా మూడో అడుగును బాలీవుడ్లో పెట్టిన కథానాయిక 'పూజా హెగ్డే'. హిందీలో హృతిక్ రోషన్ జోడీగా 'మొహంజోదారో' సినిమా చేసిన ఈ అమ్మాయి, ఆ సినిమా విడుదల వరకూ వేచి ఉండకుండా తిరిగి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టడం చర్చలకి దారితీసింది. ఒక లైలా కోసం .. ముకుంద సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మాయి, ఇక ఇక్కడ తన హవాను కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు.

అయితే అందుకు భిన్నంగా ఆమె డేట్స్ లేవని చెప్పేసింది. అందుకు కారణం అప్పటికే ఆమె హృతిక్ రోషన్ సినిమాను అంగీకరించడమే. ఇక ఈ సినిమా హిట్ అయితే ఎలాగో హిందీలో ఛాన్సులు వస్తాయి. ఒకవేళ ఆశాభంగాన్ని కలిగిస్తే టాలీవుడ్ సినిమాలు చేతిలో వుండటం మంచిదనే ముందుచూపుతోనే పూజా ఇలా వ్యవహరిస్తోందని అనుకుంటున్నారు. మరి బాలీవుడ్లో 'మొహంజోదారో' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో .. టాలీవుడ్లో అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)