ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కిల్లింగ్ వీరప్పన్' ట్రైలర్ త్వరలోనే!

Thu, Jul 09, 2015
'కిల్లింగ్ వీరప్పన్'లో సందీప్ భరద్వాజ్
'కిల్లింగ్ వీరప్పన్'లో సందీప్ భరద్వాజ్
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రం రూపొందుతోంది. వివిధ ప్రాంతాల్లోని ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తిచేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా 'తెలుగు పోస్టర్'ను విడుదల చేశారు. ఈ నెల 12న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇక తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఒకే రోజున ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో వీరప్పన్ గా 'సందీప్ భరద్వాజ్' నటిస్తుండగా, ఈ పాత్రని అంతం చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రని కన్నడ కథానాయకుడు 'శివరాజ్ కుమార్' పోషిస్తున్నాడు. సాధారణంగా జయాపజయాలకు అతీతంగా రాంగోపాల్ వర్మ చిత్రాలపై ఆసక్తి ఏర్పడుతూ వుంటుంది. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాలతో యూత్ లో కుతూహలాన్ని రేకెత్తిస్తూనే వున్నాడు. అలాగే ఈ సినిమా కూడా యూత్ లో ఆసక్తి .. అంచనా పెంచుతోంది.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)