ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ సినిమాయే టెన్షన్ పెడుతుందట!

Tue, Jul 07, 2015
రెహ్మాన్
రెహ్మాన్
జీవితంలో ప్రతి మనసు కోరుకునే ప్రశాంతతను రెండంటే రెండే అందిస్తాయి. వాటిలో ఒకటి ఆధ్యాత్మిక చింతన అయితే, రెండవది సంగీతం. ఆ రెండింటినీ సమపాళ్లలో స్వీకరించిన వ్యక్తిగా ఎ.ఆర్.రెహ్మాన్ కనిపిస్తాడు. అందుకే ఎప్పుడు చూసినా ఆయన ప్రశాంతంగా కనిపిస్తుంటాడు .. ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినిపిస్తుంటాడు.

అంచలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయస్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న రెహ్మాన్, ఒక్క రజనీ సినిమాకి సంగీతం చేయవలసి వచ్చినప్పుడే తనకి కాస్త టెన్షన్ అవుతుందని ఒక సందర్భంలో చెప్పాడు. తమ సినిమాకి సంగీతాన్ని అందించడానికి రెహ్మాన్ ఒప్పుకుంటే అంతకన్నా అదృష్టం లేదని ఎంతోమంది దర్శక నిర్మాతలు అనుకుంటూ వుంటారు. ఆయన అందించే బాణీల కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు.

అలాంటి రెహ్మాన్ .. రజనీకాంత్ సినిమాకి బాణీలను అందించే విషయంలోనే కాస్త టెన్షన్ పడతాడట. ఎందుకంటే .. రజనీ అభిమానుల సంఖ్య ఇంతని చెప్పలేం, ఆ సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా వుంటాయి. దేశవిదేశాల్లో ఆయన సినిమాలు విడుదలవుతుంటాయి. ఆ స్థాయికి ఎంతమాత్రం తగ్గకుండా తన సంగీతం వుండాలి. రజనీ అభిమానులందరికీ సంతృప్తిని కలిగించే విధంగా తాను కష్టపడాలి. అంతటి కృషి తాను చేస్తున్నానా .. లేదా? అనే విషయమే టెన్షన్ కి గురిచేస్తూ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)