ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ ఆ సినిమా చేయదట!

Sun, Jul 05, 2015
కాజల్
కాజల్
ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు ఓపక్క అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, మరోపక్క వచ్చిన అవకాశాన్ని ఆమె జారవిడుచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ధనుష్ తో 'మారి', విశాల్ తో 'పాయం పులి' సినిమాలలో నటిస్తున్న కాజల్ కి లారెన్స్ నుంచి ఓ ఆఫర్ వచ్చిందట. ఇటీవల 'కాంచన' సీక్వెల్ తో మంచి హిట్టు కొట్టిన లారెన్స్ త్వరలో తన తమ్ముడు ఎల్విన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇందులో పెద్ద హీరోయిన్ అయితే, తన తమ్ముడికి కాస్త గుర్తింపు బాగుంటుందన్న ఉద్దేశంతో కాజల్ ని సంప్రదించాడట. రెండు కోట్ల వరకు పారితోషికం కూడా ఆఫర్ చేశాడనీ, అయితే కాజల్ తిరస్కరించిందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఓపక్క పెద్ద హీరోలతో చేస్తూ, మరోపక్క ఇలా కొత్త వాళ్లతో చేస్తే ఉన్న అవకాశాలు కూడా పోతాయన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ని అమ్మడు వదులుకుందట!
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)