ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫస్ట్ లుక్ తో అభిమానుల ముందుకి 'షేర్'

Sat, Jul 04, 2015
'షేర్' లో ఓ దృశ్యం
'షేర్' లో ఓ దృశ్యం
'షేర్' .. ఈ టైటిలే కథలోని దమ్ముని .. కథానాయకుడిలోని సత్తాను చాటిచెబుతోంది. అందుకే, ఈ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుంది. మల్లికార్జున్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నెల 5న కల్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను .. డిజిటల్ పోస్టర్ ను విడుదల చేశారు. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 'పటాస్' లానే ఈ సినిమా కూడా హిట్ చిత్రంగా కల్యాణ్ రామ్ ఖాతాలో చేరుతుందనే ఆశాభావాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)