ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదృష్టవంతురాలినంటోన్న శ్రేయా ఘోషల్

Sat, Jul 04, 2015
శ్రేయా ఘోషాల్
శ్రేయా ఘోషాల్
సుమధురమైన స్వరానికి .. సుమనోహరమైన రూపానికి పెట్టిన పేరుగా 'శ్రేయా ఘోషల్' కనిపిస్తుంది. ఆమె స్వరం మనసును జ్ఞాపకాల దొంతరలోకి తీసుకెళుతుంది .. అనుభూతి ఆకాశంలో విహరింజేస్తుంది. అలాంటి శ్రేయా ఘోషల్ తాను చాలా అదృష్టవంతురాలినని చెబుతోంది. ఇళయరాజా సంగీత సారథ్యంలో పాడటం కన్నా అదృష్టం ఏముంటుందని అంటోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలి, గుజరాతి, పంజాబీ తదితర భాషల్లోని తీయని పాటలకు ఆమె స్వరం తెలుసు. ఆమె స్వరంలోని ప్రత్యేకత ఆయా భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది.

దక్షిణాదిలోను తాను ఎంతోమంది సంగీత దర్శకులతో కలిసి పనిచేశాననీ, అయినా ఇళయరాజా సంగీత సారథ్యంలో పాడటం మరచిపోలేని అనుభవాన్నీ .. అనుభూతిని కలిగిస్తుందని ఆమె చెబుతోంది. ఆయన సారథ్యంలో పాడే అవకాశం కలిగినప్పుడల్లా, స్వరాలకి సంబంధించి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం కలుగుతోందని అంటోంది. అలాంటి మహానుభావుడి సంగీతంలో పాడే అవకాశాన్ని పొందిన తాను నిజంగా అదృష్టవంతురాలినని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)