ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'దటీజ్ రజనీ' అంటున్నారు!

Sat, Jul 04, 2015
రజనీకాంత్
రజనీకాంత్
సాధారణంగా నటనలో కొంత అనుభవం గడించాకా, కొత్త దర్శకులు చెప్పేది కొంతమంది పెద్దగా పట్టించుకోకపోవడం జరుగుతూ వుంటుంది. "ఏంటి మాకే చెబుతున్నావా?" అంటూ కొత్త దర్శకుడిని పైకీ, కిందకి చూసేవారు కూడా లేకపోలేదు. అలాంటి ఈ రోజుల్లో రజనీకాంత్ రిహార్సల్స్ కి హాజరు కావడం .. "ఎలా చేయమంటారో చెప్పండి!" అంటూ ఒక యువ దర్శకుడిని అడగడం గురించే ఇప్పుడంతా కోలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు.

రజనీకాంత్ కథానాయకుడిగా యువదర్శకుడు రంజిత్ ఒక సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులకు ఆయన రిహార్సల్స్ నిర్వహించాడట. ఒక్క రజనీకి మాత్రం నేరుగా లొకేషన్ కి వస్తే సరిపోతుందని చెప్పాడట. అయినా అందరితో పాటు రజనీ కూడా వచ్చి ఆ రిహార్సల్స్ లో పాల్గొన్నాడు. ఎలా చేయాలి ..? ఇలా చేస్తే ఎలా వుంటుంది .. ? అంటూ ఆయన రంజిత్ ని అడుగుతూ వుంటే అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారట. అంతగా ఒదుగుతూ వుండటం వల్లనే ఎంతగానో ఎదిగాడనే విషయమే ఇప్పుడు అక్కడ వినిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)