ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలా పవన్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు!

Fri, Jul 03, 2015
హరీష్ శంకర్ - పవన్ కల్యాణ్
హరీష్ శంకర్ - పవన్ కల్యాణ్
'గబ్బర్ సింగ్'గా పవన్ కల్యాణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా పవన్ క్రేజ్ ను మరింత పెంచడమే కాకుండా, యూత్ ని విపరీతంగా ప్రభావితం చేసింది. ఇక మాస్ ఆడియన్స్ ఇప్పటికీ ఈ సినిమాను మరిచిపోలేదు. అలాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు 'హరీష్ శంకర్'. పవన్ కల్యాణ్ సినిమాకి దర్శకుడిగా అవకాశం లభించడం అంతతేలికైన విషయం కాదు. ఎందుకంటే, ఆయనకి దర్శకత్వం పైనా .. స్క్రిప్ట్ పైనా మంచి అవగాహన వుంది.

అలాంటి పవన్ కల్యాణ్ నమ్మకాన్ని హరీష్ సంపాదించుకోవడానికి కారణం 'మిరపకాయ్' చిత్రం. రవితేజాతో ఈ సినిమాను తెరకెక్కించడానికి ముందు, హరీష్ ఈ కథను పవన్ కల్యాణ్ కి వినిపించాడట. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అతను వినిపించిన ఆ కథ .. దానిని చెప్పినతీరు .. అతని కాన్ఫిడేన్స్ పవన్ కి బాగా నచ్చాయట. అయినా కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా చేయలేకపోయాడు.

దాంతో రవితేజాతో హరీష్ 'మిరపకాయ్' సినిమాను తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేశాడు. కాకపోతే పవన్ తో కలిసి పనిచేయలేకపోయినందుకు ఆయనకి బాధగా ఉండేదట. అదే సమయంలో 'గబ్బర్ సింగ్' సినిమాకి గాను పవన్ అవకాశం ఇవ్వడం .. తనపై ఆయనకి గల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి హరీష్ కృషి చేయడం .. ఈ సినిమా సూపర్ హిట్ కావడం జరిగిపోయాయి. అలా పవన్ తో పనిచేయాలనే కోరిక నెరవేరడం తన జీవితంలో జరిగిన ఒక అద్భుతంగా హరీష్ ఇప్పటికీ చెబుతూ వుంటాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)