ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలోనే తెరపైకి శ్రీదేవి కూతురు!

Fri, Jul 03, 2015
శ్రీదేవి - జాహ్నవి
శ్రీదేవి - జాహ్నవి
కొత్త సినిమాలకి సంబంధించిన కథలు వినడంలో శ్రీదేవి చాలా బిజీగా వుంటోందట. అయితే ఆమె వింటున్న కథలు తనకోసం కాదు .. తన కూతుళ్ల కోసం. తన కూతుళ్లను కథానాయికలుగా పరిచయం చేయడం కోసం అందుకు తగిన కథలను ఆమె వింటోంది. శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి .. ఖుషీ కపూర్ ఆల్రెడీ మీడియా ద్వారా చాలామందికి తెలుసు. శ్రీదేవి తన కూతుళ్లను వెండితెరకి పరిచయం చేయాలని అనుకుంటోందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే వున్నాయి.

ఆ విషయాన్ని శ్రీదేవి దగ్గర ప్రస్తావించినప్పుడల్లా, అందుకు తగిన సమయం రావాలని చెబుతూ వచ్చింది. ఆ సమయం ఇప్పుడు వచ్చిందేమో అందుకు రంగాన్ని సిద్ధం చేస్తోంది. శ్రీదేవికి కథ నచ్చడమే తరువాయి .. ముందుగా వెండితెరపైకి పెద్ద కూతురు జాహ్నవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వైపున నటిగా తాను తిరిగి బిజీ అవుతూ .. కూతుళ్లను కూడా కథానాయికలను చేసేందుకు ఆమె చేసే ప్రయత్నం త్వరలో నెరవేరబోతుందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)