ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అప్పుడేనట!

Thu, Jul 02, 2015
సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ మంచి దూకుడు మీద వున్నాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తన స్పీడు పెంచే పనిలో వున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'పిల్లా నువ్వులేని జీవితం' సెంటిమెంట్ ప్రభావంతో ఈ సినిమాలోను కథానాయికగా రెజీనా అలరించనుంది. యూత్ నాడీ తెలిసిన నిర్మాతగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, మాస్ ఆడియన్స్ ఆకట్టుకోవడంలో ఆల్రెడీ సక్సెస్ అయిన హరీష్ శంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో యూత్ తో పాటు మాస్ ప్రేక్షకుల మనసు కూడా దోచేయలనే విధంగా సాయిధరమ్ తేజ్ ప్లాన్ చేసుకున్నాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)