ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డిక్టేటర్ సరసన సోనాల్ చౌహాన్!

Thu, Jul 02, 2015
సోనాల్ చౌహాన్
సోనాల్ చౌహాన్
బాలకృష్ణ 99వ చిత్రంగా రూపొందుతోన్న 'డిక్టేటర్' కథ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో కథానాయికగా 'సోనాల్ చౌహాన్'ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ లెజెండ్ సినిమాలో ఆమె బాలయ్యతో జోడీ కట్టి, ఆడియన్స్ ని ఆకర్షించింది. దాంతో మరోమారు ఆయన సరసన నటించే ఛాన్స్ ను కొట్టేసింది.

సాధారణంగా బాలయ్య సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండటాన్నే ఆయన అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా 'అంజలి' ఎంపిక కాగా .. తాజాగా సోనాల్ ని తీసుకున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సినిమా టైటిల్ కి తగిన విధంగా బాలయ్య కేరెక్టర్ ని పవర్ ఫుల్ గా చూపించడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)