ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ సినిమాకి సునీత ఓకే చెప్పిందా?

Thu, Jul 02, 2015
సునీత
సునీత
త్రివిక్రమ్ తరువాత సినిమా పవన్ కల్యాణ్ తో ఉంటుందనే వార్తలను బలపరుస్తూ, తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆయన సినిమాలో పవన్ కి పిన్నిగా గాయని సునీత నటించడానికి అంగీకరించిందనేదే ఆ వార్త సారాంశం. ఇప్పుడిదే విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.

గాయనిగా .. డబ్బింగ్ కళాకారిణిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సునీత, ఇకపై నటిగా తెరపై కనిపించనుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే ఈ పాత్ర చేయవలసిందేనంటూ తనని ఎవరూ సంప్రదించలేదని సునీత చెప్పుకొచ్చింది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, పవన్ కల్యాణ్ కి పిన్నిగా నటించడానికి ఆమె అంగీకరించిందట. ఈ పాత్ర ప్రాముఖ్యతను .. ప్రాధాన్యతను గురించి త్రివిక్రమ్ చెప్పడంతో ఆమె ఒప్పుకుందని చెబుతున్నారు. మరి ఈసారి వార్తలపై సునీత ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)