ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజా అభిమానం అలాంటిది!

Mon, Jun 29, 2015
ఇళయరాజా
ఇళయరాజా
సంగీతలక్ష్మీ కోసం అహర్నిశలు తపస్సుచేసే మహర్షిలా ఇళయరాజా కనిపిస్తుంటాడు. ఎప్పుడు చూసినా సంగీత ప్రపంచంలో విహరించే ఆయన, తనకి లభించే తక్కువ సమయాన్ని కూడా అంతే తక్కువ మందికి కేటాయిస్తూ వుంటాడు. అలాంటి ఇళయరాజా, ఒక ఆత్మీయుడి కోసం పరుగు పరుగునా ఆసుపత్రికి వెళ్లాడు. ఆ వ్యక్తి దగ్గరే వుండి ఆయనని బుజ్జగిస్తూ ఆహారాన్ని తినిపించాడు. ఆయన్ని అంతలా స్పందింపజేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు, 'ఎమ్మెస్ విశ్వనాథన్'! ఆనాటి మధురగీతాలను పలకరిస్తే అవి ఆయన పేరునే ఇష్టంగా పలుకుతూ వుండటం వినొచ్చు.

అలాంటి ఆయనంటే ఇళయరాజకి ఎంతో అభిమానం .. మరెంతో గౌరవం. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి .. ఇళయరాజా ప్రతి రోజూ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఉండేవాడట. ఈ నేపథ్యంలో ఇటీవల ఆసుపత్రిలో చేరిన విశ్వనాథన్ ఆహారం తీసుకోవడం లేదని ఇళయరాజాకి తెలిసింది. అంతే .. విశ్వనాథన్ కి ఇష్టమైనవి చేయించుకుని అక్కడికి తీసుకెళ్లి, స్వయంగా ఆయనకి తినిపించాడు. వాళ్ల అనుబంధానికి ఈ సంఘటన అద్దం పడుతోంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)