ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ మెచ్చిన విలన్!

Sun, Jun 28, 2015
శరత్ కేల్కర్
శరత్ కేల్కర్
పవన్ కల్యాణ్ నటించే సినిమాలో ప్రధాన విలన్ గా నటించే ఛాన్స్ రావడమంటే మాటలా? అదిప్పుడు ఓ మరాఠీ నటుడిని వరించింది. బాబీ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్ 2' సినిమాలో విలన్ గా శరత్ కేల్కర్ అనే మరాఠీ ఆర్టిస్ట్ నటిస్తున్నాడు. ఈ పాత్ర ద్వారా ఓ కొత్త నటుడిని పరిచయం చేయాలనుకుని, ఎంతో మంది నటులను పరిశీలించి చివరికి పవన్ ఇతనిని ఎంపిక చేశాడట. ఇటీవల శరత్ పాల్గొన్న కొన్ని సన్నివేశాలను షూట్ చేశారని, అవి పవన్ కి బాగా నచ్చాయని అంటున్నారు. శరత్ నటనలోని విలక్షణత, వాయిస్ లోని గాంభీర్యం, వృత్తి పట్ల అంకితభావం పవన్ కు మరింతగా నచ్చాయట. త్వరలో జరిగే షెడ్యూల్ లో పవన్, శరత్ లపై కూడా సన్నివేశాలను షూట్ చేస్తారు!
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)